29 నుంచి పీజీ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

29 నుంచి పీజీ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

29 నుంచి పీజీ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు డిగ్రీ వన్‌టైం చాన్స్‌ పరీక్షలకు 26 మంది గైర్హాజరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, 1, 3వ సెమిస్టర్లు, ఇంటిగ్రేటెడ్‌ పీజీ (ఐదేళ్ల కోర్సులు) 7, 9వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 29వ తేదీన ప్రారంభమై ఆగస్టు 14వ తేదీవరకు నిర్వహించబడతాయని పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ వన్‌టైం చాన్స్‌ బ్యాక్‌లాగ్‌ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్‌ పరీక్షలకు బుధవారం 26 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 262 మందికి 250 మంది హాజరు కాగా 12 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ప రీక్షలకు 172 మందికి 158 మంది హాజరు కా గా 14మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

క్యాంపస్‌ డ్రైవ్‌లో

29 మంది ఎంపిక

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో డ్రగ్స్‌ (హైదరాబాద్‌) కంపెనీ బుధవారం క్యాంపస్‌ (వాక్‌–ఇన్‌) ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో తెయూ రసాయన శాస్త్ర విభాగంతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన మొత్తం 29 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు హెటిరో డ్రగ్స్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ శ్రీకాంత్‌, వేణుమాధవ్‌ తెలిపారు. ఎంపికై న వారిలో 10 మంది డిగ్రీ, 19 మంది పీజీ విద్యార్థులున్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను తెయూ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ యాదగిరి, రసాయనశాస్త్ర విభాగాధిపతి సాయిలు, అధ్యాపకులు బాల్‌కిషన్‌, గంగాకిషన్‌, డానియల్‌, రాజేశ్వరి, నాగేంద్రబాబు, సురేశ్‌, నాగేశ్వర్‌రావు అభినందించారు. వీసీ మాట్లాడుతూ.. పరిశ్రమలతో వర్సిటీల అనుసంధానం విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ అపర్ణ సూచించారు. తెయూ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌4 ఆధ్వర్యంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో భాగంగా యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు ‘నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎంబీఏ నోడల్‌ అధికారి లావణ్య, ప్రోగ్రాం ఆఫీసర్లు నర్సయ్య, స్వామి, అలీమ్‌ఖాన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement