కలెక్టరేట్‌ ఎదుట వీడీసీ సభ్యుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట వీడీసీ సభ్యుల ధర్నా

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

కలెక్టరేట్‌ ఎదుట వీడీసీ సభ్యుల ధర్నా 20 నుంచి తెయూ ఇంటిగ్రేటెడ్‌ పీజీ పరీక్షలు నకిలీ కరెన్సీ పట్టివేత

నిజామాబాద్‌ అర్బన్‌: కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నందిపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, సుధాకర్‌, గ్రామస్తులు ధర్నా చేశారు. నందిపేటలో వీడీసీ భవనం నిర్మాణానికి, నర్సరీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని బోరుకూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ సర్పంచ్‌ ఎర్రం లింగం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీలతో అట్టి స్థలాన్ని ధ్వంసం చేశారని అన్నారు. అధికారులు తక్షణమే సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

కొనసాగుతున్న

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 28 మందికి 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 12 మందికి 11 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులకు సంబంధించి నాల్గో, ఐదో సెమిస్టర్లు, 7, 9వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కే సంపత్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

28 నుంచి..

పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని సంపత్‌కుమార్‌ మరో ప్రకటనలో తెలిపారు. పీజీ ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యు, ఎంబీఏ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ 4 వ సెమిస్టర్‌, ఐఎంబీఏ 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, ఐఎంబీఏ, ఐపీసీహెచ్‌ 6వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌, ఐపీసీహెచ్‌ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ సిద్ధాంత పరీక్షలకు ఈ షెడ్యూల్డ్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆయా పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www. telanganauniversity.ac.in ను సంప్రదించాలని ఆయన సూచించారు.

నిజామాబాద్‌ అర్బన్‌: వర్నిచౌరస్తాలో బుధవారం నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు ఐదో టౌన్‌ ఎస్సై సునీల్‌ తెలిపారు. వాహనాల తనిఖీలో కై జర్‌, రమేశ్‌గౌడ్‌ అనే ఇద్దరు బైక్‌పై వస్తుండగా వారి ప్రవర్తనలో మార్పు గమనించిన పోలీసులు వారిని ఆపారు. వారి నుంచి రూ.500 నోట్లతో ఉన్న రూ.1లక్షా65వేలు ఉన్న నగదును స్వాధీనం చేసుకోగా అందులో ఉన్న రూ. లక్ష నగదు నకిలీ కరెన్సీగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు వీరికి సహకరించిన 8 మంది నిందితులపై కేసు నమోదు చేయగా రమేశ్‌గౌడ్‌, కై జర్‌లను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement