అధ్యాపకుల పదోన్నతులు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకుల పదోన్నతులు పూర్తి చేయండి

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య

తెయూ(డిచ్‌పల్లి): జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య తెలంగాణ యూనివర్సిటీని సందర్శించారు. పరిపాలనా భవనంలో వీసీ, రిజిస్ట్రార్‌లను కలిశారు. తెయూ ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, టూటా (తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌) ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. వివిధ కారణాల చేత 12 సంవత్సరాలుగా పెండింగ్‌ లో ఉన్న 2014 అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని తెయూ వీసీ ప్రొఫెసర్‌ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి లకు చైర్మన్‌ వెంకటయ్య సూచించారు. అనంతరం కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్యతో పాటు సభ్యుడు రాంబాబు నాయక్‌ను వీసీ, రిజిస్ట్రార్‌, టూటా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, విద్యార్థులు, నాన్‌ టీచింగ్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేర్వేరుగా ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ సమస్యల మీద విద్యార్థులు, నాన్‌ టీచింగ్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్యకు వినతిపత్రాలు అందజేవారు. కమిషన్‌ చైర్మన్‌ వెంట డీఆర్‌వో గీత, ఆర్‌ఐ సంతోష్‌, ఎస్సై ఎండీ ఆరీఫ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement