రేపు ఇందూరు రణభేరి | - | Sakshi
Sakshi News home page

రేపు ఇందూరు రణభేరి

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

సుభాష్‌నగర్‌: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 17న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్‌ (పాత కలెక్టరేట్‌) వద్ద ఇందూరు రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి తెలిపారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. రణభేరి కార్యక్రమా న్నివిద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శులు పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారి ఆమంద్‌ విజయ్‌కృష్ణ, కార్పొరేటర్‌ శ్రవణ్‌, బీజేపీ ఐటీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్‌, నాయకులు అంబదాస్‌ రావు, వంశీ గౌడ్‌, విపుల్‌ రావు, రాజ్‌ గణేశ్‌, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement