మోపాల్: మండలంలోని కంజర్ శివారులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ – ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ ప్రకృతి పర్యావరణ అవగాహన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డులు దక్కినట్లు ప్రిన్సిపాల్ జి విజయలలిత బుధవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 238 పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, టాప్ పదింటిని ఎంపిక చేశారని, తిరిగి అందులో నుంచి 3 బెస్ట్ పాఠశాలలను ఎంపిక చేశారని తెలిపారు. అందులోనూ కంజర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల స్థానం సాధించిందని పేర్కొన్నారు. పాఠశాలకు బెస్ట్ స్కూల్ అవార్డుతోపాటు బెస్ట్ అడ్వయిజరీ టీచర్స్ అవార్డు డి ఉదయశీల, ఎన్ రాజేశ్వరికి, బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు సోనాక్షి, కృష్ణప్రియ, మినాక్షి, ఆకృతి, అమూల్య, నిహారికకు లభించాయన్నారు. అవార్డులను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ – ఇండియా ట్రస్టీ, చైర్మన్ వీ అనిల్‌కుమార్, స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ అందజేశారని తెలిపారు.


