అసలైన ఉద్యమకారులను గుర్తించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ కొంతమందికే సమాచారం ఇచ్చి సలహాలు స్వీకరిస్తుందని, అసలైన ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీలోమంగళవారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై చర్చించారు. పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. ఇకనైనా కమిటీ అసలైన ఉద్యమకారులను గుర్తించి తగు న్యాయం చే యాలని కోరారు. నాయకులు శ్రీనివాస్‌గౌడ్, పిట్ల సరిత, రవి, ప్రదీప్, రవీందర్ నాయక్, పస్క నర్స య్య, పిల్లి శ్రీకాంత్, పులి జైపాల్, ఎల్‌బీ రవి కుమా ర్, సౌందర్య, ప్రసన్న, సిద్ధలక్మి, బట్టు సురేష్, సంతోష్, బాల్‌రాజు నాయక్, సుధాకర్, రమేష్ నాయ క్, భరత్, సత్యం, వాసరి సాయినాథ్, విజయలక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
నేడు క్యాంపస్‌లో వాక్–ఇన్ ఇంటర్వ్యూ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రముఖ ఔషధ సంస్థ హెటెరో డ్రగ్స్ సహకారంతో వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు తెలిపారు. తెయూలోని తన ఛాంబర్‌లో కార్యక్రమ బ్రోచర్‌ను వీసీ మంగళవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలు నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. ఈ వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు హెటెరో డ్రగ్స్, హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీఏ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఐటీఐ, డిప్లొమా తదితర అర్హతలు కలిగి, 2024–2026 మధ్య ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి సాయిలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధి లో కొనసాగుతున్న డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ వన్‌టైమ్ చాన్స్ పరీక్షలు మంగళవా రం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 253 మంది విద్యార్థులకు గాను 233 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 238 మంది విద్యార్థులకు గాను 223 మంది హాజరు కాగా 15 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు ప్రారంభం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఎ ల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్ట ర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమై నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు గాను 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగి న పరీక్షకు 09 మంది విద్యార్థులకుగాను ఆరుగురు హాజరు కాగా ముగ్గురు గైర్హాజరైనట్లు తెలిపారు.


