అనుమతిలేని బడులపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

అనుమతిలేని బడులపై చర్యలు తీసుకోండి

Jul 15 2026 5:03 AM | Updated on Jul 15 2026 5:03 AM

అనుమతిలేని బడులపై చర్యలు తీసుకోండి కామారెడ్డిలో ‘ప్రేమకథా చిత్రం’ షూటింగ్‌

ఖలీల్‌వాడి: జిల్లాలోని అనుమ తి లేని ప్లేస్కూళ్లపై చర్యలు తీ సుకోవాలని డీఈవో అశోక్‌ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 20న సాక్షి దినపత్రికలో ‘ప్లే స్కూళ్లలో భరోసా ఎక్కడ?‘ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు విద్యాశాఖ అధి కారులు స్పందించారు. ప్లే స్కూల్స్‌ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని విద్యాశాఖ దృష్టికి రాలేదని తెలిపారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులకు తమ పరిధిలో అలాంటి పాఠశాలలు ఏమైనా ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

గంజాయి పట్టివేత

నిజామాబాద్‌అర్బన్‌ : నగరంలోని బాబన్‌సపహాడ్‌లో మంగళవారం ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడిచేసి ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో వెంకటేశ్‌ తెలిపారు. బజాజ్‌పల్సర్‌ వాహనంపై సౌద్‌చౌస్‌ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద 152 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: వీకేఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆ ధ్వర్యంలో సందేశాత్మక ప్రేమకథా చిత్రం షూటింగ్‌ సోమవారం రాత్రి కామారెడ్డి సమీపంలోని ఒక దాబా హోటల్‌లో ప్రారంభించారు. వీకే రమేష్‌ నిర్మాతగా, సత్యమార్క దర్శకత్వంలో హీరో, హీరోయిన్‌గా మధు, పూజ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గేయ రచయితగా రుద్రంగి రమేష్‌, సంగీతం జరపాల రమేష్‌, కోరియోగ్రాఫర్‌ గా అమ్మ రమేష్‌ పని చేస్తున్నారు. జిల్లాకు చెందిన యువకులు కొందరు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్‌ మనోహర్‌రావు క్లాప్‌ కొట్టగా కథానాయిక పూజపై క్లాప్‌ కొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement