● అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు
తరలించిన పోలీసు సిబ్బంది
నిజామాబాద్ రూరల్: హైదరాబాద్‌లోని సీఎం రే వంత్‌రెడ్డి ఇంటి ఎదుట సోమవారం నిజామాబాద్ జిల్లా ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) అధ్యక్షుడు సమీర్ అ హ్మద్ నేతృత్వంలో రాష్ట్ర, నియోజకవర్గాల నాయకు లు భారీ ధర్నా నిర్వహించారు. సీఎం ఇంటి ముట్ట డికి యత్నించగా పోలీసు సిబ్బంది వారిని అడ్డుకొ ని హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు సమీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్దూ ప్రథమ భాషగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. బోధన్‌లోని శక్కర్‌నగర్ మధుమాలంచ హైస్కూల్ (ఇంగ్లీష్ మీడియం)లో ఉర్దూను ప్రథమ భాషగా ఎంచుకోవాలనుకునే మైనారిటీ విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడంపై మండిపడ్డారు. తక్షణమే వారికి అడ్మిషన్లు ఇవ్వాలని, ఉర్దూ ఉపాధ్యాయులను ని యమించాలని డిమాండ్ చేశారు. నాయకులు జు నైద్ అహ్మద్, జుబేర్ అహ్మద్ తదితరులు ఉన్నారు.


