డిచ్‌పల్లి: ‘సర్’ ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాసరావు సూచించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్పంచ్ వాసుబాబు ముందుకు వచ్చి ఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు హెల్ప్‌డెస్క ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా జరుగుతున్న సర్ ఓటరు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో 80– 90 శాతం ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ నమోదయ్యేలా చూడాలని సూచించారు.


