భీమ్‌గల్‌ కోర్టు భవనం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

భీమ్‌గల్‌ కోర్టు భవనం పరిశీలన

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

కమ్మర్‌పల్ల(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణంలో నిర్మాణం పూర్తయిన నూతన కోర్టు భవనాన్ని ఎండీసీ, ఎస్‌సీయూ మాజీ చైర్మన్లు ఈరవత్రి అనిల్‌కుమార్‌, మానాల మోహన్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భీమ్‌గల్‌ ప్రాంత ప్రజలకు కోర్టు ఏర్పాటు ఎంతోకాలంగా ఉన్న అవసరమని, న్యాయ సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం వల్ల ప్రజల సమయం, ధనం ఆదా అవుతుందని తెలిపారు. కోర్టు భవనంలోని మౌలిక వసతులు, నిర్మాణ పనులను పరిశీలించి, ప్రజలకు త్వరలోనే పూర్తి స్థాయిలో న్యాయ సేవలు అందుబాటులోకి రావాలని వారు ఆకాంక్షించారు. నాయకులు బొదిరె స్వామి, నాగేంద్ర బాబు, గోపాల్‌ నాయక్‌, కన్నె సురేందర్‌, సుంకరి సురేష్‌, మేకల శ్రీనివాస్‌, దొనకంటి రాజేష్‌, ముల్క అరుణ్‌, గట్టు సతీశ్‌, మల్లేష్‌ మెండోర ఉపసర్పంచ్‌ కుంట రమేశ్‌, బాబాపూర్‌ సర్పంచ్‌ సమీర్‌, బాబాపూర్‌ ఉపసర్పంచ్‌ గోవర్ధన్‌, పిప్రి ఉపసర్పంచ్‌ జేమ్స్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement