నిజామాబాద్ అర్బన్: నగరంలోని బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. నగరంలోని గాజులపేటకు చెందిన నవీన్(25)అనే యువకుడు పాలు విక్రయిస్తూ, జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం బైపాస్ రోడ్డులోని పవర్‌గార్డెన్ వద్ద నవీన్ స్కూటీపై బయలుదేరగా, అర్సపల్లి వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.


