రైతుల సమస్యలపై సమీక్షించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలపై సమీక్షించాలి

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

నిజామాబాద్‌ అర్బన్‌: రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్చించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. అనంతరం దినేష్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు సాగు చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నీటి లభ్యతపై ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. రైతులకు సరిపడ నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా తక్షణమే కల్పించాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్‌ భుజంగరావుకు వారు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement