గుప్పుమంటున్న గంజాయి | - | Sakshi
Sakshi News home page

గుప్పుమంటున్న గంజాయి

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

అదుపులోకి తీసుకున్నాం

బాన్సువాడ : గంజాయి విక్రయాలకు బాన్సువాడ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రెండు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉన్న బాన్సువాడలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. బాన్సువాడ, బీర్కూర్‌ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు అటువైపు దృష్టి సారించకపోకవడం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కూలీలు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి దందా సాగిస్తున్నారు. వారం రోజుల క్రితం బీర్కూర్‌లో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీర్కూర్‌ మంజీర నదిపై వారధి నిర్మించడంతో మహారాష్ట్రకు రవాణా సౌకర్యం చాలా దగ్గరైంది. దీంతో అక్రమార్కులు ఈ వారధి నుంచే దెగ్లూర్‌ ప్రాంతం నుంచి బీర్కూర్‌కు గంజాయి తీసుకొస్తున్నట్లు తెలిసింది. బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీ, తాడ్కోల్‌ డబుల్‌ బెడ్‌ రూం కాలనీ, గౌలీగూడ తదితర ప్రాంతాల్లో రోజువారీ కూలీలు, యువకులు గంజాయి మత్తులో జోగుతున్నారు. టీ పాయింట్ల వద్ద సిగరెట్లలో గంజాయిని సేవిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం ఇస్తే తప్ప అటు వైపు అధికారులు దృష్టి సారించలేకపోవడం గమనార్హం.

కూపీ లాగుతున్న పోలీసులు..

ఇటీవల బీర్కూర్‌లో గంజాయి సేవిస్తుండగా పట్టుబడిన నలుగురు కూడా మైనర్లే కావడం గమనార్హం. ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటకకు దగ్గరగా ఉన్న బాన్సువాడ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు, ఎకై ్సజ్‌ శాఖ అధికారులు నిత్యం తనిఖీ లు చేపట్టడంతో పాటు గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించారు. పాత కేసుల్లో పట్టుబడిన వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

వారం రోజుల క్రితం నలుగురు మైనర్లు గంజాయి సేవిస్తుండగా అదుపులోకి తీసుకున్నాం. వీరికి గంజాయి ఎక్కడ లభించింది. ఎవరు సరఫరా చేస్తున్నారు.. అనే కోణంలో విచారణ చేస్తున్నాం. ప్రత్యే క నిఘా పెట్టాం. గంజాయికి యువకులు బానిస కావొద్దు. గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు. –రాములు, ఎస్సై, బీర్కూర్‌

బానిసలుగా మారుతున్న

రోజువారీ కూలీలు, యువకులు

టీ పాయింట్లు, పట్టణ శివారు

ప్రాంతాలే అడ్డాలు

తాజాగా బీర్కూర్‌లో నలుగురు

యువకుల అరెస్ట్‌

అవగాహన కల్పిస్తున్నా ఫలితం శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement