రేపు కార్గ్గో పార్సిళ్ల వేలం | - | Sakshi
Sakshi News home page

రేపు కార్గ్గో పార్సిళ్ల వేలం

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

రేపు కార్గ్గో పార్సిళ్ల వేలం డిగ్రీ పరీక్షలకు 23 మంది గైర్హాజరు ఏఐటీయూసీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ

ఆర్మూర్‌టౌన్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్‌ డిపోలోని కార్గో పార్సిల్‌ సర్వీస్‌ కార్యాలయంలో మిగిలిపోయిన పాత వస్తువులకు వేలంపాట నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్‌ ప్రతిమరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్‌ బస్టాండ్‌ ప్రాంతంలోని బస్‌పాస్‌ కౌంటర్‌ వద్ద ఈనెల 15న సాయంత్రం 4.00 గంటలకు వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొని తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ వన్‌టైం ఛాన్స్‌ పరీక్షలకు సోమవారం 23 మంది గైర్హాజరైనట్లు అకడమిక్‌ ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 171 మంది విద్యార్థులకు గానూ 158 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 146 మంది విద్యార్థులకు గానూ 136 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని ఏఐటీ యూసీ కార్యాలయంలో సోమవారం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అ ధ్యక్ష, కార్యదర్శులుగా ఓమయ్య, వెన్నెల హ నుమాండ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చక్రపాణి, రాజన్న, కవిత, అంజ య్య, చందర్‌. సహాయ కార్యదర్శిగా సంజీవ్‌, అనిల్‌, దేవేందర్‌, భాగ్యలక్ష్మి, గోవర్ధన్‌, సంప త్‌ కోశాధికారిగా ఎస్డి ఫెరోస్‌తోపాటు కార్యవ ర్గ కౌన్సిల్‌ సభ్యులను ఎన్నుకున్నారు. అంతకుముందు వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగులందరిని పర్మినెంట్‌ చేయాల ని లేదా కాంట్రాక్ట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయా లని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్‌, అనిల్‌, చందర్‌, గోవర్ధన్‌, ఫెరోస్‌, రాధా కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు: మండలంలోని గుర్జకుంట గ్రా మంలో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌లను చోరీ చేశారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐదు ట్రాన్స్‌ఫార్మార్లను సోమవా రం వేకువజామున దుండగులు ధ్వంసం చేసి, అందులోని కాపర్‌ కాయల్స్‌ ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ జాదవ్‌ బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement