నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లోని ఒకటవ నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి సోమవారం ఓ రైలు వేగంగా దూసుకొస్తోంది. దూరం నుంచే ఆ రైలు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొందరు ప్రయాణికులు ఏమాత్రం భయం లేకుండా పట్టాలపైనే నడుస్తూ ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రమాదమని తెలిసినా.. లగేజీ బ్యాగులతో ఉన్న ప్రయాణికులు కనీసం వెనుక నుంచి వస్తున్న రైలును కూడా గమనించకుండా, నిర్లక్ష్యంగా పట్టాలు దాటారు. కాస్త అటుఇటైనా ఘోర ప్రమాదం జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉందని అక్కడి వారు చర్చింకున్నారు. ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


