నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇ లా.. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తున్న నాగావ ళి ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నారనే స మాచారం రావడంతో సోమవారం స్టేషన్‌లో రైలు ఆగిన అనంతరం పోలీసులు తనిఖీలు చేపట్టారు. బీహార్‌కు చెందిన అఖిల్ అలం, మహమ్మద్‌చాంద్ అనే ఇద్దరు వ్యక్తులు 5.1 కిలోల గంజాయిని సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళుతున్న నాగవల్లి ఎ క్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు. అలాగే గంజాయిని, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. ట్రెయినీ ఏఈఎస్ గాయత్రి, కా నిస్టేబుళ్లు దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొన్నారు.
బోధన్‌లో..
బోధన్: పట్టణంలోని బాబాగార్డెన్ వద్ద సోమవా రం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు చేపట్టగా, బోధన్‌కు చెందిన షేక్ కమ్రాన్ వద్ద 194 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. కమ్రాన్ మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ నుంచి గంజాయి తీసుకొచ్చినట్టు తమ విచారణలో తెలిసిందని పేర్కొన్నారు. గంజాయిని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు వివరించారు.


