జిల్లాలో
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని అటవీప్రాంతంల్లో పులులు, చిరుతలు, వన్యప్రాణులే లక్ష్యంగా వేటగాళ్లు చెలరేగిపోతున్నారు. భీమ్‌గల్, ఇందల్‌వా యి, సిరికొండ, మంచిప్ప రేంజ్‌లో వన్యప్రాణుల ను వేటాడేందుకు ముఠాగా ఏర్పడినట్టు తెలుస్తోంది. జిల్లాలోని భీమ్‌గల్ మండలం దేవక్కపేట శివా రులో ఇటీవల చిరుతను వేటాడినట్టుగా అటవీ, పోలీస్‌శాఖల అధికారులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన పలువురు వేటకోసం నాటు తుపాకులను వినియోగిస్తున్నట్టు అధికారుల విచా రణలో బయటపడింది. దేవక్కపేట గ్రామంలోనే వేటగాళ్ల నుంచి 15 వరకు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. జిల్లాలోని అటవీప్రాంతంలోని చిరుతలే లక్ష్యంగా వేటగాళ్లు బలితీసుకుంటుండటం, తీగ లాగినకొద్దీ ఒక్కోటి బయటపడుతుండటం జిల్లాలో కలకలం రేపుతోంది.
నాటు తుపాకులతో..
పులులు, చిరుతల గోర్లు, చర్మాన్ని విక్రయించేందు కు వేటగాళ్లు ఏకంగా ముఠాగా ఏర్పడినట్టు తెలు స్తోంది. భీమ్‌గల్ రేంజ్ పరిధిలోని దేవక్కపేట సమీపంలో చిరుతను బలితీసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. చిరుతపులిని వేటాడి ఖననం చేసిన ప్రాంతంలో కళేబరానికి అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపించారు. విషప్రయోగంతో చిరుతను వేటాడినట్లు అధికారు లు భావిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపడుతున్న సమయంలోనే దేవక్కపేట గ్రామంలో పలువురు నిందితుల నుంచి 15 వరకు నాటు తు పాకులు లభ్యమైనట్టుగా తెలిసింది. తాజా ఘటన నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేపడుతుండగా, 6 నెలల కిందట మరో చిరుతను సైతం వేటాడిన విషయం బయటపడినట్టు సమాచారం. ఇందల్‌వాయి రేంజ్ పరిధిలోని అన్సాన్‌పల్లి సెక్షన్ రామడుగు బీట్ సమీపంలో చిరుతను చంపి కళేబరాన్ని బావిలో పడేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ధర్పల్లికి చెందిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని అటవీప్రాంతాల్లో వేటాడేందుకు ఏర్పడిన ముఠా బాగోతంపై పోలీసులు నేడో, రేపో మీడియా ఎదుట వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
జే1 టైగర్ ఉన్నట్టా? లేనట్టా?
ఈ ఏడాది మార్చిలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల మీదుగా జిల్లాలోకి వచ్చిన జే–1 పెద్దపులి ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. కమ్మర్‌పల్లి, సిరికొండ, సిరిసిల్ల రేంజ్‌లలో కొంత కాలంపాటు తిరిగిన పెద్దపులి ఏప్రిల్ 17 నుంచి జాడ లేకుండాపోయింది. అధికారులు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా పెద్దపులి కదలికలు నమోదుకాలేదు. ఇక్కడి నుంచి ఎక్కడికై నా వెళ్లిందా, లేక ఇక్కడే ఉందా అని అధికారులు ట్రాక్ చేయలేకపోయారు. కమ్మర్‌పల్లి రేంజ్‌పరిధిలో పెద్ద పులి జాడ కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు చేపట్టిన ట్రాకింగ్‌లో భాగంగానే చిరుతల వేట బయటకు వచ్చినట్టు సమాచారం. పెద్దపులి జాడను వెతుక్కుంటూ అడవిలో జల్లెడ పడుతున్న నేపథ్యంలోనే చిరుతపులుల వేటగాళ్ల ఆనవాళ్లు దొరికినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అడవిలో వేటగాళ్లు వినియోగించిన గ్లౌవ్స్, సామగ్రి అటవీ అధికారుల కంటపడటంతో ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే దేవక్కపల్లిలో, ధర్పల్లిలో వేటగాళ్ల ముఠాకు చెందిన వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
జిల్లాలోని కమ్మర్‌పల్లి, ఇందల్‌వాయి ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో చిరుతలను వేటాడి హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. హంటింగ్ ముఠాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తీగ లాగినాకొద్దీ డొంక కదలుతున్న చందంగా.. వన్యప్రాణుల వేటకు సంబంధించి రోజుకో విషయం బయటపడుతోంది. అయితే జిల్లాలో సంచరించి కనిపించకుండా పోయిన పెద్ద పులి ఎక్కడ ఉందనేది మిస్టరీగా మారింది.
సీరియస్‌గా తీసుకున్నాం
జిల్లాలోని అటవీప్రాంతంలో రెండు చిరుతలను వేటాడినట్టు ఆనవాళ్లు లభించాయి. దీనిపై సీరియస్‌గా విచారణ చేపడతున్నాం. ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తాం. – సుశాంత్ సుఖ్‌దేవ్,
ఇన్‌చార్జి డీఎఫ్‌వో, నిజామాబాద్
వన్యప్రాణులే టార్గెట్..
వ్యవస్థీకృతంగా సాగుతున్న వేటగాళ్ల రాకెట్ దందా
భీమ్‌గల్ మండలం దేవక్కపేటలో
అదుపులోకి నిందితులు
ఇందల్‌వాయి రేంజ్ పరిధిలోనూ చిరుతను వేటాడినట్టు గుర్తింపు
తీగ లాగితే బయటపడుతున్న
ముఠా లింకులు


