నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 156 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావుతోపాటు డీఆర్‌వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయ న్న, డీపీవో శ్రీనివాస్‌రావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


