పంటలు ఎండకుండా చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండకుండా చర్యలు తీసుకోవాలి

Jul 14 2026 1:48 AM | Updated on Jul 14 2026 1:48 AM

వర్ని: ఖరీఫ్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదా రు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఎలినినో ప్రభావ పరి స్థులు, సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌, జాకోరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల పురోగతిపై సోమవా రం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. ఇదివరకే వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతుల అవసరాన్ని బట్టి ప్రాజెక్టుల కింద సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దాపూర్‌ రిజర్వాయర్‌, జాకోరా, చందూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ల పైప్‌లైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇన్‌చార్జి సీఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి

అథ్లెటిక్స్‌కు రితీశ్‌

డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థి రితీశ్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ రవీందర్‌ సోమవారం తెలిపా రు. జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ అండర్‌–18 విభాగంలో 1500 మీటర్ల రన్నింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో రితీశ్‌ ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి మెదక్‌ జిల్లాలో నిర్వహించనున్న రా ష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీఈటీ తె లిపారు. రితీశ్‌ను జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రాజాగౌడ్‌, పీఈటీలు రవీందర్‌, శ్రీనివాస్‌, సందీప్‌తోపాటు పాఠశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌ అభినందించారు.

యాప్‌ ద్వారానే యూరియా తీసుకోవాలి

సిరికొండ: ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకొని యూరియా తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి రైతులకు సూచించారు. మండల కేంద్రంతోపాటు కొండూర్‌ గ్రామంలో ప్రైవేట్‌ ఫెర్టిలైజర్‌ దుకాణాలను డీఏవో సోమవారం తని ఖీ చేశారు. రికార్డులను, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎలాంటి లింకులు అంటగట్టకుండా రైతులకు ఎరువులను విక్రయించా లని ఆయన డీలర్లను ఆదేశించారు. మండలంలో ఇప్పటి వరకు యాప్‌ ద్వారా రైతు లు 41,500 యూరియా బస్తాలను కొనుగో లు చేశారని తెలిపారు. భారీ వర్షాలు కురవ డం లేదని, వరికి బదులు ఆరు తడి పంటల ను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏడీఏ కృష్ణ, మండల వ్యవసాయశాఖ అధికారి నర్సయ్య ఉన్నారు.

‘స్వయం ఉపాధి’

కోసం శిక్షణ

ఖలీల్‌వాడి: స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారికి నైపుణ్యాభివృద్ధిలో భాగంగా ఎనిమిది రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వారై అర్హులైన వారు 8 రోజుల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోఆలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌ యెండల టవర్‌ వద్ద ఉన్న నిపుణ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు http://tsscb havitha.cgg.gov.in/ homePage Candidate Cornerలో పేర్లను నమోదు చేసుకోవాలని, దరఖాస్తుతో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, కులం, ఆదాయం, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను జత చేసి జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని రూమ్‌ నంబర్‌ 102లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement