● అడిషనల్ కలెక్టర్ భుజంగరావు
మాక్లూర్ : ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారందరూ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని దాస్‌నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు ఆయన అల్బెండజోల్ మా త్రలు వేశారు. సోమవారం మాత్రలు వేసుకోని వారు ఈనెల 20వ తేదీన తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజ శ్రీ, డీఈవో అశోక్, డాక్టర్ అశోక్, రీజినల్ కో ఆర్డినేటర్ సత్యనాథ్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికిందర్‌నాయక్, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


