నిజామాబాద్ రూరల్: ప్రముఖ బాల సాహిత్య వేత్త, కవి, రచయిత చింతల శ్రీనివాస్ గుప్తా రచించిన ‘చిగురింతలు’ గేయ సంపుటికి జాతీయస్థాయి నాగభైరవ పురస్కారం లభించిందని ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు సోమవారం తెలిపారు. గత నెలలో నిర్వహించిన పోటీల్లో బాల సాహి త్యానికి సంబంధించి జాతీయస్థాయిలో సుమారు 200 రచనలురాగా అందులో చింతల రచించిన చిగురింతలు పుస్తకానికి పురస్కారం వరించిందన్నారు. నిర్వాహకులు ఒంగోలులో ఆగస్టు 16న నిర్వహించనున్న కార్యక్రమంలో శ్రీనివాస్‌గుప్తాకు పురస్కారం అందజేయడంతోపాటు సన్మానిస్తారన్నారు. శ్రీనివాస్ గుప్తాకు ప్రముఖ బాల సాహితీవేత్తలు వీఆర్ శర్మ, గరిపల్లి అశోక్, కవులు వీపీ చందన్‌రావు, గణపతి అశోక్‌శర్మ, మహేశ్‌బాబు, గంట్యాల ప్రసాద్, ప్రవీణ్‌కుమార్ శర్మ, డాక్టర్ శారద తదితరులు అభినందనలు తెలిపారు.


