● 150కి పెంచుతూ ఎన్‌ఎంసీ అనుమతి
సుభాష్‌నగర్: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 150కి పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కృష్ణమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 120 సీట్లతో కళాశాల కొనసాగుతుండగా, అదనంగా 30 మంజూరు చేయడంతో సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఎన్‌ఎంసీకి చెందిన నలుగురు అసెస్సర్ల బృందం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు కోసం గతనెల 17వ తేదీన ప్రభుత్వ వైద్యకళాశాలతోపాటు ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల ఆధారంగా సో మవారం సీట్ల సంఖ్యను పెంచుతూ అధికారికంగా అనుమతి పత్రాన్ని జారీ చేసిందని తెలిపారు.


