అడుగంటుతున్న జలం! | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న జలం!

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్‌నినో కారణంగా సకాలంలో వరుణు కరుణించకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి పడిపోతున్నాయి. జూన్‌ నెలలోనే భూగర్భ జల మట్టాలు 0.75 శాతం మేర తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ సమయానికి వర్షాలతో భూగ ర్భ జల మట్టం పెరగాల్సి ఉండగా.. ఈసారి పరిస్థి తి తలకిందులైంది. ప్రస్తుతం జిల్లాలో 36.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణం. వర్షాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సాగు నీటి సంక్షోభం నెలకొంది. రైతులు ప్రస్తుతం నాట్లు వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వానలు కురవకపోవడంతో రైతాంగం పూర్తిగా వ్యవసాయ బోర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. దీంతో బోర్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడం, మరోవైపు వాడకం పెరగడంతో బోర్లు సరిపడా నీటిని పోయడం లేదు. పంటలకు తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రధాన జలాశయాలు, చెరువులు ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. జిల్లాలో సుమారు లక్షకు పైగా వరకు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. సిరికొండ మండలంతోపాటు నిజామాబాద్‌, ధర్పల్లి, భీమ్‌గల్‌, ఽవేల్పూర్‌, మోర్తాడ్‌, డొంకేశ్వర్‌, నందిపేట్‌, మాక్లూర్‌ ప్రాంతాల్లో వేగంగా భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఆగుతూ పోస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటలు సాగు చేస్తున్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పలు ప్రాంతాల్లో ఎత్తిపోతలు ఉండడంతో సాగుకు అవసరమైన నీరందుతోంది.

నీరు లేక వెలవెలబోతున్న డొంకేశ్వర్‌ మండలంలోని నికాల్‌పూర్‌ జంగం చెరువు

నెల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో..)

జనవరి 9.56

ఫిబ్రవరి 10.57

మార్చి 11.67

ఏప్రిల్‌ 11.88

మే 11.86

జూన్‌ 12.61

జిల్లాలో 82 ఫీజో మీటర్లలో ఇదీ పరిస్థితి..

జిల్లా వ్యాప్తంగా అధికారులు 82 ఫీజో మీ టర్లు ఏర్పాటు చేసి ప్రతినెలా గ్రౌండ్‌ వాట ర్‌ లెక్కలు తీస్తున్నారు. మే నెలలో 11.68 మీటర్ల లోతులో ఉన్న నీరు జూన్‌కు వచ్చే సరికి 12.61 మీటర్ల లోతులోకి వెళ్లిపోయా యి. ఫీజో మీటర్ల వారీగా జూన్‌ లెక్కలు చూస్తే... 28 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అదే విధంగా 43 ఫీజో మీటర్లలో 10 నుంచి10 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అలాగే 11 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 50 శాతం మేర ఆరోగ్యకర నీటి మట్టాలు ఉన్నట్లు గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌ మెంట్‌ లెక్కలు చెబుతున్నాయి. వర్షాలు పడితేగాని భూగర్భ జలాలు పెరిగి చెరువులు నిండే, పంటల పండే పరిస్థితి కనిపించడం లేదు.

జూన్‌లో 0.75 శాతం తగ్గిన

నీటి మట్టాలు

జిల్లాలో 36.4 శాతం లోటు వర్షపాతం

ఎండుతున్న చెరువులు..

వరినాట్లకు తప్పని తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement