ఓట్లు తొలగిపోకుండా చూస్తాం | - | Sakshi
Sakshi News home page

ఓట్లు తొలగిపోకుండా చూస్తాం

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

కమ్మర్‌పల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో పౌరుల ఓట్లు తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామ ని అదనపు కలెక్టర్‌ భుజంగరావు అన్నారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంతోపాటు హాసాకొత్తూర్‌లో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను ఆదివారం ఆయన పరిశీలించారు. ఎన్యుమ రేషన్‌ ఫామ్‌ల స్వీకరణ, డిజిటలైజేషన్‌ వివరాలను తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో వెనుకబడి ఉన్న కమ్మర్‌పల్లి, మానాల గ్రామాల్లో సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. తహసీల్దార్‌ నరేశ్‌, ఆర్‌ఐ శరత్‌కుమార్‌, సర్పంచ్‌ నలిమెల గంగారెడ్డి ఉన్నారు.

సిద్ధులగుట్టపై రేంజ్‌ డీఐజీ ప్రత్యేక పూజలు

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న శివాలయంలో బాసర జోన్‌ రేంజ్‌ డీఐజీ భాస్కరన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐ జీ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు సిద్ధుల గుట్ట విశిష్టతను డీ ఐజీకి వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిమ్మీ, రవి, చరణ్‌రెడ్డి, బట్టు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘మహా’ పోలీసుల

అదుపులో దొంగల ముఠా?

ఫూణెలో పట్టుబడిన దుండగులు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలోని మూడు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున చోరీలకు పాల్పడిన దుండగుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మూర్‌లోని మెడికల్‌ షాప్‌తోపాటు నిజామాబాద్‌ నగరంలో రెండు చోట్ల చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నలుగు రు సభ్యులున్న ముఠా మహారాష్ట్ర వైపు పరారైంది. దుండగులను పట్టుకునేందుకు సీపీ సాయిచైతన్య 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. శనివారం సాయత్రానికి మహారాష్ట్రలోని ఆయా ప్రాంతాలకు చేరుకున్న ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలింపు చేపట్టాయి.

బొలెరో దొంగిలించి..

చోరీ చేసిన టాటా సుమోలో జిల్లాకు వచ్చిన దొంగల ముఠా అదే వాహనంలో పరారైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పూణే కు చేరుకున్న ముఠా సభ్యులు అక్కడ బొలెరోను చోరీ చేసినట్లు తెలిసింది. పుణే శివారులోని ఓ హోటల్‌లో ఉండగా బొలెరోను గుర్తించిన స్థానికులు దుండగులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించగా.. నిజామాబాద్‌ జిల్లాలో చోరీకి పాల్పడింది ఈ ముఠానే అని నిర్దారణ అయినట్లు సమాచారం. సదరు ముఠాపై అనేక దొంగతనం కేసులు ఉండడంతో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండడంతో జిల్లా పోలీసులు వెనుదిరిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement