నులి పురుగును నిర్మూలిద్దాం.. | - | Sakshi
Sakshi News home page

నులి పురుగును నిర్మూలిద్దాం..

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

సుభాష్‌నగర్‌: పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు రోగాల బారిన పడతారు. ముఖ్యంగా నులిపురుగులు అపరిశుభ్రత కారణంగా శరీరంలోకి చేరుతాయి. నులిపురుగుల బారిన పడిన పిల్లల్లో అ నారోగ్య సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఎదు గుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవా న్ని (ఎన్‌డీడీ) పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనుంది. ముందుగా గుర్తించిన సెంటర్ల వద్ద ఈనెల 13వ తేదీన, మాప్‌ అప్‌ డే సందర్భంగా 20వ తేదీన మిగిలిపోయిన పిల్లలకు రెండు విడతల్లో మాత్రలు పంపిణీ చేయ నున్నారు. ఇందుకోసం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా అల్బెండజోల్‌ మాత్రలు అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్స్‌కు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందజేశారు.

అపోహలు వద్దు..

పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రల ఇవ్వడంపై తల్లిదండ్రులు అపోహలు పెట్టుకోవద్దు. మాత్రలు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయి. అయితే జ్వరం, ఫిట్స్‌ వచ్చిన పిల్లలు అల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవద్దు. జ్వరం పూర్తిగా నయమైన తర్వాత మలివిడత 20వ తేదీన మాత్రలు వేసుకోవాలి. మాత్రల పంపిణీని ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని డీఎంహెచ్‌వో రాజశ్రీ పేర్కొన్నారు.

3 లక్షల 90 వేల మంది పిల్లలకు..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్లు, వసతి గృహాలు, రెసిడె న్షియ ల్స్‌, నర్సింగ్‌ కళాశాల, ఐటీఐ, పాలిటెక్నిక్‌, జూనియర్‌ కళాశాలల్లో మొత్తం 3 వేలకుపైనే కేంద్రాలు ఏర్పాటు చేసి మాత్ర లు పంపిణీ చేయనున్నారు. 1నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు 3,90,297మంది ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు సగం మాత్రను, రెండు నుంచి మూడేళ్లలోపు వారికి ఒక మాత్రను క్రష్‌ చేసి ఇవ్వాలి. అలాగే మూడేళ్ల నుంచి 19ఏళ్ల పిల్లలు ఒక మాత్రను చంపరించి, నమిలి మింగాలి.

నేటి నుంచి జిల్లాలో అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

1 నుంచి 19 ఏళ్ల లోపు వారందరికీ తప్పనిసరి

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement