దోషులకు శిక్ష పడేలా చూస్తా.. | - | Sakshi
Sakshi News home page

దోషులకు శిక్ష పడేలా చూస్తా..

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

బాధితులకు అన్ని విధాలా

అండగా ఉంటా..

ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నాలుగు నెలల క్రితం కువైట్‌ దేశంలో అనుమానాస్పదంగా మృతి చెందిన గుగులోత్‌ కై లాశ్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండటంతోపాటు నిందితులకు శిక్ష పడేలా చూస్తామని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి తండాను సందర్శించిన ఎమ్మెల్యే కై లాశ్‌ తల్లిదండ్రులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. కై లా శ్‌ను ఇదే మండలంలోని మేలయతండాకు చెందిన తండ్రీ కొడుకు కలిసి హత్య చేసి ఎడారిలో పాతిపెట్టారని, ఎలాగైనా తమకు న్యాయం చేయా లని తల్లిదండ్రులు ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఎమ్మెల్యే అక్కడే ఉన్న డిచ్‌పల్లి సీఐ, ఎస్సైలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కై లాశ్‌ మృతి కేసులో పరారీలో ఉన్న నిందితుడు గణేశ్‌ ఆచూకీ కనిపెట్టి నిజానిజాలు రాబట్టాలని ఆదేశించారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి రూ.10 వేలు సాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఘటన విషయమై ఇప్పటికే సంబంధిత ఎన్నారై అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సాయం అందజేస్తామన్నారు. నిందితుల్లో ఒకరిని కువైట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇక్కడే ఉన్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. త్వరలోనే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంబర్‌సింగ్‌, ఐడీసీఎంఎస్‌ మాజీ అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్‌నాయక్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్‌ గంగాధర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్‌, సొసైటీ చైర్మన్‌ రాంచందర్‌గౌడ్‌, సర్పంచులు బానోత్‌ సంగీత మహేశ్‌, పోతె ప్రభాకర్‌, నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement