బోధన్: బోధన్ డివిజన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా లోల శంకర్, ఉపాధ్యక్షుడిగా మోత్కూ రి నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పట్టణ కేంద్రంలోని సంఘ కార్యాలయంలో నూతన పాలక వర్గ సభ్యుల తో ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త పాలక వర్గ సభ్యులకు చేనేత కార్మికులు, పలువురు ప్రజాప్రతినిధులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్ర మంలో పాలక వర్గ సభ్యులు పత్తి గంగారాం, మోత్కూరి లక్ష్మణ్, శ్యాంసుందర్ పహాడే, మోత్కూరి సాయిలు, తాటిపాముల విజయ్ కుమా ర్, మోత్కూరి కళావతి, జోరీగల లక్ష్మి పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో శుక్రవారం ఎన్నికలు జరుగగా చెన్న రవికుమార్ ప్యానల్‌తో కూడిన తొమ్మిది మంది డైరెక్టర్లు విజయవంతం సాధించారు. కాగా శనివారం తొమ్మిది మంది డైరెక్టర్‌లలో చెన్న రవికుమార్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ చైర్మన్‌గా బెక్కి గంగామోహన్, సెక్రెటరీగా కొండి రాము, కోశాధికారిగా చిట్ల శ్యాంసుందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. సంఘం అభివృద్ధికి, కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని చైర్మన్ అన్నారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను చేనేత కార్మికులు సన్మానించారు.
నూతన అధ్యక్షుడు రవికుమార్‌తో డైరెక్టర్లు
అధ్యక్ష, ఉపాధ్యక్షులను సన్మానిస్తున్న సభ్యులు


