నిజామాబాద్ అర్బన్ : సిద్దిపేట జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్–14 అత్యాపత్యా పోటీలకు జిల్లా జట్టు బయల్దేరినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్‌రెడ్డి తెలిపారు. నగరంలోని కలెక్టర్ గ్రౌండ్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు తేవాలని, మంచి క్రీడా నైపుణ్యం ప్రదర్శించి విజేతగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంజీవ్, మీసాల ప్రశాంత్, వ్యాయామ ఉపాధ్యాయులు స్వప్న, కల్పన, శ్రీకాంత్, ప్రదీప్ పాల్గొన్నారు.


