గుట్టలుగా ప్లాస్టిక్
ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు, 55 మండలాలు, 1056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత పదేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం 50 శాతం పెరిగింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచులు, చెత్త గుట్టలుగా పేరుకుపోతున్నాయి. భూమి లోనికి నీరు ఇంకే అవకాశం లేకుండా చేస్తున్నాయి. దీంతో మొక్కల పెరుగుదల ఆగిపోతోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు, ఇతర జంతువులు తిని జీర్ణం కాకపోవడం మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్‌ను కాలుస్తుండడంతో వెలువడే బయాక్సిన్, పూన్చిరాన్ వంటి విషవాయువులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి.
గుట్టలుగా ప్లాస్టిక్


