నకిలీ నోట్ల కేసులో 8 మంది అరెస్ట్
వర్ని: వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు వర్ని ఎస్‌ఐ రాజు మంగళవారం వెల్లడించారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతో పాటు అతని తమ్ముడు నరేడ్ల శంకర్, అఫంధి ఫారం కు చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్ , ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డి లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 లక్షల 86 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, రెండు ప్రింటర్లు, ఒక ల్యాబ్ టాప్, 8 ఫోన్లు, ఒక మారుతి బ్రీజా కార్ ను సీజ్ చేశారు. నిందితులను దొంగ నోట్ల తయారీ, పంపిణీకి సంబంధించి కేసులో రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.
అడ్మిషన్లు
తీసుకుంటే చర్యలు
● డీఈవో పార్శి అశోక్
ఖలీల్‌వాడి: నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లు తీసుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని డీఈవో పార్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని పాఠశాలలు 2026–2027 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్స్ చేస్తున్నారని, అందుకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమాన్యలు అడ్మిషన్స్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేకపోతే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యాధి నిర్ధారణ
పరీక్షలు పెంచాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
సుభాష్‌నగర్: పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు పెంచాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ పేర్కొన్నారు. 35 ఆరోగ్య ఉపకేంద్రాలు, పల్లెదవాఖానాల సిబ్బందితో ఆమె మంగళవారం సమీక్షించారు. ఆభా రిజిస్ట్రేషన్ 10 శాతం కంటే తక్కువగా ఉండి, అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలను చేయడంలో అలసత్వం వహిస్తున్న సిబ్బందిని మందలించారు. హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ లాంటి పరీక్షలను ప్రణాళికాబద్ధంగా గ్రా మాల వారీగా నమోదు చేయాలన్నారు. ఎన్‌సీడీ కోఆర్డినేటర్ వెంకటేశం, డీడీఎం నారాయణ, పృథ్వీ, హెచ్‌ఈవో శ్రీనివాస్, డీహెచ్ ఈ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నిజాంషుగర్స్ కార్మికుల నిరసన
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) మూతపడి పదేళ్లు పూర్తయి న నేపథ్యంలో మంగళవారం ఫ్యాక్టరీ ప్రధా న గేటు ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్‌ఎల్ కార్మిక సంఘ నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్ మాట్లాడు తూ ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కోల్పోయి ఎంతో మంది కార్మికులు అనారోగ్యం, ఆర్థిక స మస్యలతో మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. లేఆఫ్ నాటి బకాయి వేతనాలు చె ల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక నాయకులు బాలకృష్ణ, ఎం.శ్రీనివాస్, దాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో అత్యాచారయత్నం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఖలీల్‌వాడిలో గల పూజ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుపై అత్యాచార యత్నం జరిగింది. సోమవారం రాత్రి ఆస్పత్రిలో ఓ మహిళ రాత్రి విధులు నిర్వర్తిస్తోంది. ఆస్పత్రి నిర్వాహకులు హ న్మండ్లు, అతని స్నేహితుడు రోహిత్ రాత్రికి ఆస్పత్రికి వచ్చారు. రాత్రి 10.30 గంటల స మయంలో రోహిత్ నర్సుపై అత్యాచార య త్నానికి పాల్పడ్డాడు. తప్పించుకున్న యు వతి వేరే గదిలోకి వెళ్లి డయల్ 100 కు ఫోన్‌చేసింది. పోలీసులు రావడంతో రోహిత్ త ప్పించుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి కేసు నమోదు చేసుకున్నారు. రోహిత్‌ను అరెస్టు చేస్తామన్నారు.
నకిలీ నోట్ల కేసులో 8 మంది అరెస్ట్


