రక్తమోడిన రహదారులు
ఆటో, మోటార్ సైకిల్ ఢీ
● బైకిస్టుతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న యువతి మృతి
ఆర్మూర్: ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో చోటు చేసుకుంది. మృతులు నిజామాబాద్ నగరానికి చెందిన జెట్టివార్ సాయిప్రసాద్ (23), ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రా మానికి చెందిన వనం సంధ్యారాణి (25) గా పోలీసులు గుర్తించారు. నగరంలోని చంద్రానగర్ కాలనీకి చెందిన సాయిప్రసాద్ ఆర్మూర్ మండలం చేపూ ర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. నిజామాబాద్ నుంచి సోమవారం అర్ధరాత్రి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఆర్మూర్‌కు బయల్దేరాడు. ఎడపల్లి మండలం జాన్కంపేటకు చెందిన సంధ్యారాణి తన గ్రామానికి చెందిన 12 మందితో కలిసి పెర్కిట్‌లోని ఫంక్షన్‌హాల్‌లో క్యాటరింగ్ చేసేందుకు వచ్చింది. ఫంక్షన్ పూర్తయిన తర్వాత కూలీలంతా ఆటోలో ఎడపల్లికి బయల్దేరారు. అంకాపూర్ శివారులోకి రాగానే ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఘటనలో బైక్ నడుపుతున్న సాయిప్రసాద్‌తోపాటు ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న సంధ్యారాణి అక్కడికక్కడే మరణించింది. ఆటోలో ఉన్న మరో యువతి మరాఠీ హారిక కాలు విరగ్గా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఎండీ నదీమ్ పరారీలో ఉన్నాడు. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచా రణ చేపట్టారు. మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కూలీ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయి..
మృతురాలు సంధ్యారాణిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు ఇద్దరు కూతుర్లు కాగా, సంధ్యా రాణి పెద్ద కూతురు. వివాహం అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ పని చేసుకుంటోంది.
ఉమ్మడి జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించగా, గాంధారి మండలం చద్మల్ తండాలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మద్నూర్ శివారులో ఆటోబోల్తాపడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
రక్తమోడిన రహదారులు
రక్తమోడిన రహదారులు
రక్తమోడిన రహదారులు


