ప్రజాపాలనలో రైతు రాజ్యం
● రైజింగ్ తెలంగాణలో రైతులే కీలక
భాగస్వాములు
● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వ ప్రజాపాలనలో రైతు రాజ్యం నడుస్తోందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగధర్ అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని గడుగు గంగాధర్ మంగళవారం నిజామాబాద్‌లో మాట్లాడారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రెండేళ్ల పాలన లో రైతుల కోసం రూ.లక్ష కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అందుకే తెలంగాణ రైతులు ఈసారి రైతు దినోత్సవాన్ని ఉత్సాహంగా చేసుకున్నారన్నారు. రైతురుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, సన్నధాన్యం బోనస్ లాంటి కార్యక్రమాలతో ముందుకెళుతోందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా దే శంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. సమస్య ఉందని చెబితే రైతు కమిషన్ ద్వా రా తక్షణమే వెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు. భూమి సమస్యల నుంచి మార్కెట్ సమస్యల వరకు పలు అంశాలపై రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలను అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాబోయే రెండు దశాబ్దాల్లో తెలంగాణ సాధించాలనుకున్న లక్ష్యాలతో ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేసిందని, ఇందులో వ్యవసాయానికి, రైతుకు పెద్ద పీట వేసిందన్నారు. రేర్ పేరుతో గ్రామీణ తెలంగాణాను సుభిక్ష రాష్ట్రంగా మార్చే లక్ష్యంగా పలు చర్యలను ప్రకటించిందన్నారు. భూసార పరీక్షల నుంచి మార్కెట్‌లో పంటను అమ్ముకునేవరకు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం రాబోయే 20 ఏళ్లలో అమలు చేయనున్న అనేక కీలక కార్యక్రమాలను ఇందులో పొందుపరిచిందన్నారు.


