వచ్చే ఎన్నికలనూ సమర్థవంతంగా నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలనూ సమర్థవంతంగా ని ర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించా రు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎంపీడీవోలు, ఎంపీవోలు పంచాయతీ ఎన్నికల సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ, ఎన్నికల విధుల నిర్వహణపై ప్రతి దశలోనూ అధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ ఎన్నికలను సజావుగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరవుతూ, ప్రతి అంశాన్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకుని అప్రమత్త తో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పని చేయడంతోనే ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎన్నికలను సజావుగా పూర్తి చే సుకోగాలిగామని అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న, పంచాయతీ కార్యాలయ ఏవో రాజబాబు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
జక్రాన్‌పల్లి: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై తహసీల్దార్, ఆర్‌ఐ, ఇతర అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి అర్జీదారుడి దరఖాస్తును పరిశీలిస్తూ, పరిష్కరించేందు కు అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ తగిన న్యాయం జరిగేలా మానవీయ కోణంలో పని చేయాలన్నారు. అనంతరం రైతులతో కలెక్టర్ భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సర్పంచ్ మమత, తహసీల్దార్ కిరణ్మయి, స్థానిక అధికారులు ఉన్నారు.


