సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులు
● పర్సన్ ఇంచార్జీలను నియమించిన
సహకార శాఖ
● ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు
సొసైటీల బాధ్యతలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో సొసైటీలకు ప్ర త్యేక అధికారులను నియమించారు. సహకార శాఖ లో ఆడిటర్లుగా పనిచేస్తున్న సీనియర్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ రిజిస్టర్లకు పర్సన్ ఇంచార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీవో శ్రీనివాస్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 53, మొ త్తం కలిపి 142 సహకార సంఘాలున్నాయి. ఇవి రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. పాలకవర్గాలు రద్దు కావడంతో సొసైటీలు సవ్యంగా నడిచేందుకు సహకార సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయితే, సిబ్బంది కొ రత కారణంగా ఒకొక్కరికి రెండు నుంచి మూడు సొసైటీల బాధ్యతలు అప్పగించారు. తద్వారా పర్య వేక్షణ చేయడం వీరికి కష్టమనే చెప్పవచ్చు. కొత్త పాలకవర్గాలు వచ్చేంత వరకు సొసైటీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే నడవనున్నాయి. ప్రభు త్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా నా మినేటెడ్ పద్ధతిలో చైర్మన్లను నియమించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి కొత్త పాలకవర్గాలు వచ్చే అవకాశాలున్నాయని పలువురు మాజీ చైర్మన్లు చెప్తున్నారు.


