మద్నూర్‌లో స్కూల్ ఆటో బోల్తా
● ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండల కేంద్ర శివారులో స్కూల్ ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 12 మంది విద్యార్థులు గాయాల పాల య్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని అవాల్‌గావ్ గ్రామానికి చెందిన 12 మంది పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆటో లో మద్నూర్‌కు వస్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. గమనించిన వాహనదారులు బో ల్తా పడిన ఆటోను సరిచేసి గాయపడిన విద్యార్థులను మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కపిల్ (8వ తరగతి), హరి (9వ తరగతి) కాళ్లు, చేతులు విరగ్గా, అభిజిత్, సాయి లు, శివ, విష్ణుకాంత్, సాయి గణేశ్‌కు గాయాల య్యా యి. ఆటోలో ఐదుగురు విద్యార్థులు ప్రైవేటు పాఠ శాలకు, ముగ్గురు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.
ఆటో డ్రైవర్ గణపతికి ఎలాంటి గాయాలు కాలేదు. కళ్లు తిరగడంతోనే ఆటో అదుపు తప్పిందని డ్రైవర్ వాపోయాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అవాల్‌గావ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ఎస్సై రాజు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.


