స్తంభించిన యూరియా యాప్
● అయోమయంలో రైతులు
ఇందల్వాయి: రైతులకు యూరియా పంపిణీలో నిబద్ధత, నిల్వల్లో పారదర్శకత, డీలర్ల వివరాల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన యూరియా బుకింగ్ యాప్ సేవలు సోమవా రం నుంచి స్తంభించాయి. రైతులు యాప్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే టెంపరరీ డిసెబుల్‌డ్ అని చూపిస్తుంది. పాస్‌బుక్ నంబర్ నమోదు చేసినా నాట్ వ్యాలీడ్ అని చూపిస్తుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. కాగా, యూరియాను యాప్‌లో బుకింగ్ చేసుకొని కొనుగోలు చేసే విషయంలో చదువురాని, స్మార్ట్ ఫోన్‌లు లేని రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
సాధారణ అమ్మకాలు మొదలు..
యూరియా బుకింగ్ యాప్ నిలిచిపోవడంతో వ్యవసాయ అధికారులు, సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద సాధారణ పద్ధతిలో యూరియా అమ్మకాలకు అనుమతి ఇచ్చారు.


