మొక్కులు తీర్చేందుకు వెళ్తూ..
● ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా..
● ఒకరి మృతి.. పలువురికి గాయాలు
గాంధారి(ఎల్లారెడ్డి): మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలంలోని కాయితీ తండాకు చెందిన మంజారావు సింగ్ కుటుంబం మొక్కులు చెల్లించుకునేందుకు చద్మల్ తండాలో ఉన్న లక్ష్మమ్మ ఆలయానికి మంగళవారం ఉద యం ట్రాక్టర్‌లో బయలు దే రింది. నేరల్ గ్రామ శివారు లో ట్రాక్టర్ బోల్తాపడటంతో మంజారావు సింగ్ కుమారుడు మంజా గణేశ్(15) అక్కడికక్కడే మృతి చెందగా, మంజా మధు, మంజా కిషన్‌తోపాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రావుసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.


