సోషల్‌ వార్‌.. | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ వార్‌..

Jun 4 2025 12:42 AM | Updated on Jun 4 2025 12:42 AM

సోషల్

సోషల్‌ వార్‌..

నిజామాబాద్‌
కవిత అభిమానుల

ఘరానా దొంగల ముఠా అరెస్ట్‌

జిల్లాలో చోరీలకు పాల్పడిన ఘరానా దొంగల ముఠా సభ్యులను సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.

బుధవారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2025

– 8లో u

విత్తనాలు అందిస్తాం

వ్యవసాయ అధికారి వీరస్వామి

నిజామాబాద్‌ రూరల్‌: నాణ్యమైన విత్తనాల ను రైతులకు అందజేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారంలోని రైతు వేదికలో క్లస్టర్‌ పరిధిలోని రైతులకు 10 కిలోల వరి విత్తనా లు అందజేశారు. ఆర్‌డీఆర్‌ 1200 వరి రకం వంగడం శ్రేష్టమైనదని తెలిపారు. అపరాల పంటలైన ఎంజీజీ పెసర విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో కీటకశాస్త్ర వేత్త సాయిచరణ్‌, మండల వ్యవసాయాధికారిణి హీరా జాదవ్‌, వ్యవసాయ విస్తరణ అధి కా రులు స్వాతిలత, రాకేశ్‌, జ్ఞానేశ్వర్‌, వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వయస్సుకు సంబంధం లేకుండా యోగా చేయాలి

నిజామాబాద్‌నాగారం: వయసుకు సంబంధం లేకుండా అందరూ యోగ చేయవచ్చునని, గర్భిణులు సుఖ ప్రసవానికి, బీపీ, షు గర్‌, ఉబకాయము, గుండె జబ్బుల ని వారణకు యోగా సాధన చేయడం చక్కటి మార్గమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారిణి డాక్టర్‌ రాజ్యశ్రీ పేర్కొన్నారు. 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌ నుంచి ఓల్డ్‌ కలెక్టరేట్‌ గ్రౌండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నోడల్‌ అధికారి డా క్టర్‌ గంగదాస్‌, జిల్లా యోగ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, యోగా మాస్టర్లు రామచందర్‌, సిద్ధిరాములు, సంగీత, శ్రీనివాస్‌, ఐశ్వర్య, తేజస్విని, రుక్మయ్య కిషన్‌, భూమయ్య రెడ్‌ క్రాస్‌ప్రతినిధి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

పాత డీఎస్‌ఆర్‌ అటెండెన్స్‌ విధానాన్ని కొనసాగించాలి

సుభాష్‌నగర్‌: పంచాయతీ కార్యదర్శులకు పాత డీఎస్‌ఆర్‌ అటెండెన్స్‌ విధానాన్ని కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శుల జేఏ సీ జిల్లా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇన్‌చార్జి డీపీవో ముత్యాల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతినిధులు మాట్లాడుతూ హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న డీఎస్‌ఆర్‌ యాప్‌లో బయోమెట్రిక్‌, ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ మాడ్యుల్‌ను ప్రభుత్వం చేర్చిందని తెలిపారు. తద్వారా వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతపై పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శుల హాజరు సమయాన్ని ఉదయం 10.30 గంటలకు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కేసీఆర్‌కు కుమార్తె కవిత రాసిన లేఖ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా అభిమానులు, ఉద్యమకారులు సోషల్‌ మీడియా వేదికగా వార్‌ కొనసాగిస్తున్నా రు. కవితపై 2018 నుంచే కుట్రలు మొదలయ్యాయని, లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఓటమి కి అప్పటి ఎమ్మెల్యేలే కారకులయ్యారని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఉద్యమకారులందరం కవితవెంటే ఉంటామంటూ స్పష్టం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమా ర్తె కవిత రాసిన లేఖ విషయమై ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులు గుంభనంగా ఉన్నప్పటికీ ఉద్యమకారులు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా స్వరం గట్టిగా వినిపిస్తున్నారు. లేఖలో కవిత రాసిన అంశా లు ఆరోపణలు కాదని, పచ్చి నిజాలంటూ సోషల్‌ మీడియాలో వరుస ప్రకటనలు చేస్తున్నారు. మా ధైర్యం మీరే కవితక్క, డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులైన కొందరు సీనియర్‌ కార్యకర్తలైతే మరింత ఘాటుగా సోషల్‌ వార్‌లోకి దిగారు. జిల్లాలో కవితపై 2018 నుంచే కుట్రలు మొదలయ్యాయని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమికి ఎమ్మెల్యేలే కారకులయ్యారని అందుకు తామే ప్రత్యక్ష సాక్షులమంటూ బహిరంగ ప్రకటనలు సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్నారు. ఉద్యమకారులందరం కవి త వెంటే ఉంటామంటూ చెబుతున్నా రు. కవిత ఉనికిని ఓర్వలేని ఉమ్మడి జిల్లాలోని కొందరు మాజీ ప్రజాప్రతినిధులు పలువురు ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసినట్లు, కవితకు కమ్యూనికేట్‌ కాకుండా చేసినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడమే కాకుండా కవిత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దు, మా సోదరుడి ఫొటోను మాత్రమే పెట్టుకోవాలంటూ బెదిరింపులు చేసినట్లు చెబుతున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో మాదిరిగా వ్యవహరించడమే కాకుండా దళితబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇతర పథకాల్లో చాలామంది వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదనపు కలెక్టర్‌ అంకిత్‌

న్యూస్‌రీల్‌

లేఖ లీక్‌ పై సోషల్‌ మీడియాలో వైరల్‌..

లేఖలోనివి ఆరోపణలు కాదు..

నిజాలంటూ అభిమానుల ప్రచారం

2019 నుంచే కవితపై జిల్లాలో కుట్రలు.. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయేలా

చేశారంటున్న ఉద్యమకారులు

పీఆర్‌వో రాజేష్‌ లేఖ లీక్‌ చేశాడంటూ వైరల్‌ అవుతున్న వీడియో

కవిత ఫొటో డీపీగా పెట్టుకోవద్దంటూ ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు

ఫుల్‌స్టాప్‌ లేకుండా సోషల్‌మీడియాలో భావప్రకటన చేస్తున్న ఉద్యమకారులు

కవితకు పీఆర్‌వోగా ఉన్న రాజేష్‌ అనే వ్యక్తి కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్‌ చేసినట్లు తాజాగా సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. ఈ విషయమై కేటీఆర్‌, హరీశ్‌రావు టీముల కు సాక్ష్యాధారాలతో పూర్తి వివరాలు తెలిసినట్లు వీడియోలో ఉంది. ఈ పీఆర్‌వోనే కవితకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని బయటకు విడుదల చేసినట్లు ఇందులో ఉంది. కేటీఆర్‌, హరీశ్‌రావులపై సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయించినట్లు పేర్కొన్నారు.

తాజాగా కాంగ్రెస్‌లోని ఓ నాయకుడికి కోవర్టుగా మారి, కేటీఆర్‌, హరీశ్‌రావులకు వ్యతిరేకంగా జాతీయ మీడియాలో ప్రశ్నలు అడిగేలా ఈ పీఆర్‌వో చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. కవితను ఎక్కువగా జాతీయ మీడియాలో కనిపించాలని ప్రేరేపించినట్లు వీడియోలో వివరించారు. తాజాగా కవిత రాసిన లేఖను సైతం ఈ పీఆర్‌వో రాజేషే తనకు సన్నిహితుడైన మీడియా పర్సన్‌ ద్వారా లీక్‌ చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ మీడియా పేరిట కవిత వద్ద భారీగా డబ్బులు దండుకున్న ఇతను హైదరాబాద్‌ శివార్లలో విల్లా కొనుగోలు చేసినట్లు వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను కేటీఆర్‌, హరీశ్‌రావులకు పంపినట్లు ఉద్యమకారులు చెబుతున్నారు.

సోషల్‌ వార్‌..1
1/5

సోషల్‌ వార్‌..

సోషల్‌ వార్‌..2
2/5

సోషల్‌ వార్‌..

సోషల్‌ వార్‌..3
3/5

సోషల్‌ వార్‌..

సోషల్‌ వార్‌..4
4/5

సోషల్‌ వార్‌..

సోషల్‌ వార్‌..5
5/5

సోషల్‌ వార్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement