అయోధ్య సాధువుల మహారామార్చన యజ్ఞం
నిజామాబాద్ రూరల్: నగర శివారులోని సారంగపూర్‌లో ఉన్న హరిహరాత్మక్ బాలక్ రాంమందిర్ రామానందచార్య ఆశ్రమంలో అయోధ్య సాధువులు బుధవారం మహారామార్చన యజ్ఞం ప్రారంభించారు. జూన్ 5 వరకు కొనసాగనున్న ఈ యజ్ఞంలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు తరలిరానున్నారు. అయోధ్యకు చెందిన ప్రేమ్‌దాస్ మహరాజ్(మౌనీబాబా), ఆశ్రమ పూర్వపీఠాధిపతి రమాపతి దాస్ మహరాజ్ పర్యవేక్షణలో యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రస్తుత పీఠాధిపతి మంగళ్ దాస్ జీ మహరాజ్ తెలిపారు.
సాధువుల ప్రత్యేక సాధన
తమ జీవితాలను భగవంతుని సేవకు అంకితం చేసి ఆధ్యాత్మిక జ్ఞానంతో సమాజ శాంతి, సంతోషం కోసం సాధువులు జీవిస్తారు. తమకు దూరంగా, భగవంతుని సేవకు దగ్గర ఉండే సాధువుల దర్శనం కోసం సామాన్యులు పరితపిస్తుంటారు. అయోధ్య ఖాక్ చౌక్ కు చెందిన సాధువులు పలువురు ప్రస్తుతం నగరంలోని ఉన్న హరిహరాత్మక్ బాలక్ రామ్ మందిర్ రామానందచార్య ఆశ్రమంలో ఇలా సాధన చేస్తున్నారు. జూన్ 5వ తేదీ వరకు యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సమావేశాన్ని
విజయవంతం చేయాలి
ఎల్లారెడ్డి: భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు అన్నారు. బుధవా రం ఎల్లారెడ్డిలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబా ద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సమావేశానికి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు హాజరు కావాలన్నారు. సాయిబాబా,పద్మారావు ఉన్నారు.


