వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రి)ని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రిని రాష్ట్ర కాయకల్ప ప్రతినిధి బృందం సందర్శించే అవకాశం ఉందన్నారు. మెరుగైన పరిశుభ్రత, వసతి సౌకర్యాలు, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డు అందజేస్తారని పేర్కొన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, కాయకల్ప బృంద సభ్యులకు సరైన వివరాలు తెలియజేయాలన్నారు. డాక్టర్లు శివశంకర్, సందీప్ రెడ్డి, అశ్విని, రాజశ్రీ, స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో జింక పిల్లకు గాయాలు
రుద్రూర్: పొతంగల్ మండలం సోంపూర్ శివారు లో కుక్కల దాడిలో జింక పిల్లకు గాయాలయ్యా యి. పొలాల్లో జింక పిల్లను వెంటాడుతున్న కుక్కల గుంపును గుర్తించిన రైతులు వాటిని తరిమికొట్టా రు. జింకను గ్రామంలోకి తీసుకువచ్చి ప్రథమ చికి త్స చేయించి ఫారెస్ట్ సెక్షన్ అధికారి సురేశ్‌కు అప్ప గించారు. జింక పిల్ల బాగుండడంతో అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు ఫారెస్ట్ అధికారి తెలిపారు.
● డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస ప్రసాద్
● డిచ్‌పల్లి సీహెచ్‌సీ తనిఖీ
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


