
ఏపీఆర్‌ఏసీఏ సమావేశంలో డీసీసీబీ చైర్మన్
సుభాష్‌నగర్: ఇండోనేషియా దేశంలోని బాలిలో సోమవారం ప్రారంభమైన 78వ ఆసియా పసిఫిక్ రూరల్ అగ్రికల్చరల్ క్రెడిట్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఏసీఏ) సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిరోజు సమావేశంలో సహకార రంగ అభివృద్ధిపై చర్చించారని, మూడు రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణలో డీసీసీబీల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, పనితీరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ఉద్యోగులు, పాలకవర్గం, తదితర అంశాలపై రమేశ్‌రెడ్డి సమావేశంలో వివరించారు. ఈ సమావేశానికి భారత్ తరఫున 10 మంది ప్రతినిధులు పాల్గొనగా, అందులో తెలంగాణ నుంచి ఐదుగురు ఉన్నారు.