5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఇప్పటి వరకు 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రి య కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హను మంతు పేర్కొన్నారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై మంత్రులకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని, కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.34 లక్షల మెట్రిక్ ట న్నులు సన్న ధాన్యం, 40వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం సేకరించామని తెలిపారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చే సేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 700 ల పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. రైస్ మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట కోతలు అమలు చేయకుండా పక్కాగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెంటవెంటనే ధాన్యం తరలించేలా సరిపడా సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి యాసంగిలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి సాగు అయ్యిందని అన్నారు. ధాన్యం అమ్మకం విషయంలో రైతులు ఇ బ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. అకాల వర్షాలతో ధాన్యం నిల్వలు తడిసిపోకుండా వాతావరణ పరిస్థితులపై క్షేత్రస్థాయి అధికారులు, సి బ్బంది ముందస్తుగానే రైతులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. సాఫీగా కొనుగోళ్లు పూర్త య్యేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయా లని హితవు పలికారు. వీసీలో డీఆర్డీవో సాయా గౌడ్, డీఏవో వాజిద్ హుస్సేన్, డీఎస్‌వో అరవింద్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడి
వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్, తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష


