
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఆర్మూర్: ఆర్మూర్ పట్ట ణంలోని పంచాయతీరాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్ శ ర్మ రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డొంకేశ్వర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించిన రూ.4 లక్షల 75 వేల బిల్లుల మంజూరు చేసేందుకు రూ.7,500 ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను శ్రీనివాస్ డిమాండ్ చేసాడు. దీంతో కాంట్రాక్ట ర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళిక ప్రకారం సోమవారం కాంట్రాక్టర్ రూ.7 వేలు ఇవ్వగా తీసుకుంటున్న శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.