కాంగ్రెస్‌లో
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అత్యధిక సంఖ్యలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన బా ల్కొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం పవర్ సెంటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అంతా గందరగోళం అన్నట్లుగా తయారైంది. పార్టీ శ్రేణులు మాత్రం ఇదేం ప రిస్థితి వచ్చిందని పరేషాన్ అవుతున్నాయి. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే కథ ఇప్పటికే నడుస్తుండగా, తాజాగా ఇసుక తోలకాల విషయంలో పార్టీ నాయకుల మధ్యే రగడ నడుస్తోంది. గత ఎన్నికల ముందు మొదలైన గ్రూ పుల పంచాయితీ రానురాను మరింత పెరుగుతోంది తప్ప ఫుల్‌స్టాప్ పడడం లేదు. గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న నాయకులు పీసీసీ అధ్యక్షుడికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అంతటితో ఆగక గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నాయకుల వర్గీయుల మధ్య వాట్సాప్ గ్రూపుల్లో హోరాహోరీ వార్ నడుస్తోంది. దీంతో ఈ సోషల్ యుద్ధం వ్యవహారం పోలీసు స్టేషన్‌లకు చేరుతోంది. నియోజకవర్గంలో ఇసుక తోలకాల విషయంలో సునీల్‌రెడ్డి వర్సెస్ మానాల, ఈరవత్రి గ్రూపుల మధ్య ఎడతెగని వార్ నడుస్తోంది. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సునీల్ వర్గీయులు తమను రాకుండా చేసినట్లు ఈరవత్రి, మానాల వర్గీయులు చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ చోద్యాన్ని చూస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లబ్ధిదారుల ఎంపికపై ప్రభావం..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల ఎంపికపై నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రభావం చూపుతుందని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం గందరగోళానికి గురవుతారని అంటున్నారు.
బాల్కొండ నాయకుల మధ్య ఆధిపత్య పోరు
నియోజకవర్గంలో ఎడతెగని పంచాయితీ
ఎన్నికల ముందు నుంచే మొదలు..
ఇసుక తోలకాల పంచాయితీతో అనేక మలుపులు
చివరకు సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్న వైనం
అసెంబ్లీ టికెట్ నుంచి..
గత శాసనసభ ఎన్నికల్లో ఈరవత్రి అనిల్, మా నాల మోహన్‌రెడ్డి టిక్కెట్ ఆశించారు. అయితే కొన్నిరోజుల ముందే కాంగ్రెస్‌లో చేరిన ముత్యా ల సునీల్‌రెడ్డి అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. మానాల, ఈరవత్రిల సహకారం లేకపోవడంతోనే ఓడిపోయామని సునీల్ వర్గం ఆరోపిస్తుండగా, సునీల్‌రెడ్డి తమను పట్టించుకోలేదని, ఓటమికి తమను బాధ్యులను చేయడం సరికాదని మానాల, ఈరవత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మానాల మోహన్‌రెడ్డి రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్‌గా, ఈరవత్రి అనిల్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, అన్వేష్‌రెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పదవులు దక్కించుకున్నారు. మధ్యలో బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన రమేశ్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్ అయ్యారు.