వారం రోజుల్లో 129 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
నిజామాబాద్‌అర్బన్: కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు ఇన్‌చార్జి సీపీ రాజేశ్‌చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లతోపాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించామన్నారు. మొత్తం 129 కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రూ.8,80,000 జరిమానా విధించినట్లు తెలిపారు. కాగా, ఈ కేసుల్లో పది మందికి వారం రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి
నిజామాబాద్‌అర్బన్: న్యూ ఇయర్ వేడుకల కు పోలీసుల సూచనలు తప్పనిసరి పాటించాలని ఇంచార్జి సీపీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లే కుండా వేడుకలు నిర్వహించొద్దని పేర్కొన్నా రు. ఫాంహౌస్, క్లబ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో వేడుకలు నిర్వహించేందుకు పోలీసుల అను మతి తీసుకోవాలన్నారు. డీజేలు నిషేధమని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆదర్శం.. ఫత్తేపూర్
● వందశాతం వ్యవసాయ విద్యుత్ బిల్లుల చెల్లింపు
పెర్కిట్(ఆర్మూర్): వ్యవసాయ విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. గ్రామా నికి చెందిన రైతులందరూ శనివారం ఒకే రోజులో 646 విద్యుత్ మోటార్లకు సంబంధించిన రూ.2 లక్షల 30 వేల 400 చెల్లించా రు. రైతులు ఒకే రోజులో బిల్లులు చెల్లించేలా కృషి చేసిన లైన్‌మన్ ఎండీ యూసుఫ్‌ను ఏఈ మౌనిక రెడ్డి, ఏడీఈ శ్రీనివాస్ అభినందించారు. ఏఏవో మోహన్, లైన్ ఇన్‌స్పెక్టర్లు గంగాధర్, సిబ్బంది రాజన్న, నాగరాజు, పవర్ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
బంగారు పతకం
డిచ్‌పల్లి: రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు బంగారు పతకం సాధించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ టోర్నీలో ప్రతిభ కనబర్చిన జిల్లా జట్టు విజయం సాధించడంలో డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాల క్రీడాకారిణులు కీలకపాత్ర పోషించారు. శనివారం కళాశాలలో క్రీడాకారులను ప్రిన్సిపల్ నళిని, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత, స్కూల్ పీఈటీలు జ్యోత్స్న, నర్మద, అకాడమీ కోచ్ మౌనిక, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.
వారం రోజుల్లో 129 డ్రంకెన్ డ్రైవ్ కేసులు


