రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ఆర్మూర్: మండలంలోని మంథని గ్రామానికి చెందిన దంపతులు జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రామానికి చెందిన దంపతులైన కత్రాజ్ మోహన్, రాధ తమ కూతురు కీర్తితో కలిసి శనివారం కొండగట్టు దర్శనానికి వెళ్లారు. తిరిగి కారులో వారు స్వగ్రామానికి వస్తుండగా కోరుట్ల సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ ప్రమాద స్థలిలోనే మృత్యువాత పడ్డారు. కూతురు కీర్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు దంపతులు ఒకేసారి మరణించడంతో మంథని గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
● మృతులు ఆర్మూర్ మండలం మంథని వాసులు
● కొండగట్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా కోరుట్లలో చోటుచేసుకున్న ఘటన


