సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భిక్కనూరు: డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు వహించాలని జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్ అన్నారు. శనివారం భిక్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైం, సైబర్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన కల్పించారు. విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బెంగుళూరులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాద్యాయులు గడ్డం మల్లేశ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం భవానీ, ఉపాధ్యాయులు, ఉమ, ప్రసన్న,నర్సింహారెడ్డి, శంకర్‌రెడ్డి, తమ్మలిరాజు పాల్గొన్నారు.
పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ
నస్రుల్లాబాద్ : స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తనిఖీ చేశారు. మండలంలో క్రైం రేటు తగ్గించాలని 100 నెంబరుకు వ చ్చిన కాల్స్‌పై వెంటనే స్పందించాలన్నారు. ఎస్సై రాఘవేంద్ర, కానిస్టేబుల్‌లు ఉన్నారు.
అనుమానం వస్తే సమాచారం అందించాలి
మద్నూర్(జుక్కల్): గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మద్నూర్ ఎస్సై రాజు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతు శాంతి భద్రతలను కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.


