గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆర్మూర్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలోగల ఆర్కే ఆస్పత్రి సమీపంలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్మూర్ పోలీసులు శనివారం తెలిపారు. కాలనీలోని రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉండటంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను మృతిచెందినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు ఒంటిపై నల్ల రంగు చొక్కా ధరించాడని, ఎవరైనా ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.


