రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
డిచ్‌పల్లి: మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని చిన్నోళ్ల అక్షయ (9వ తరగతి) ఎస్‌జీఎఫ్ రా ష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం గంగ సావిత్రి, వ్యాయామ ఉపాధ్యాయుడు రాము శనివా రం తెలిపారు. ఈనెల 29న వికారాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా అక్షయను హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లు
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు కరాటే పోటీల్లో పాల్గొనేందుకు ఆయా జిల్లాకు శనివారం బయల్దేరి వెళ్లారు. గోదావరిఖనిలో ఈనెల 29 వరకు నిర్వహించే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కరాటే రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది క్రీడాకారులతో అండర్–17 బాలబాలికల జట్టు వెళ్లిందని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే.హీరాలాల్ ఒక ప్రకటనలో తెలిపారు.


