పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
నవీపేట: మండల కేంద్రంలోని ప్రయివేట్ హాస్టల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. మోపాల్ మండలంలోని బాడ్సికి చెందిన మేడ్చల్ సూర్య(18) నవీపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న అక్షయ మెస్, ప్రయివేట్ హాస్టల్ ఉంటున్నాడు. ఎప్పటిలాగే శనివారం సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన అతడు హాస్టల్ గదిలోకి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు కరెంట్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వాహకుడు దేవెందర్‌కు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై యాదగిరిగౌడ్, ఏఎస్సై గఫర్ ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి గంగాదాస్ దుబాయ్‌లో ఉంటాడని, తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు.


